Currency Calculator

వేములవాడలో వేద పాఠశాల నెలకొల్పుతాం

వేములవాడ రాజన్న సన్నిధిలో త్వరలో వేద పాఠశాలను నెలకొల్పుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తెలిపారు. నాలుగురోజులుగా నిర్వహిస్తున్న వేద విద్వన్మహాసభల ముగింపు సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. తెలంగాణలోని అన్ని వేద పాఠశాలలకు ఆర్థిక సహాయం అందిస్తామని, వేద పాఠశాలల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.500 అందజేస్తామని, వారి విద్య పూర్తయిన తర్వాత వారి కుటుంబానికి వెసులుబాటు కోసం రూ.5 లక్షలు అందజేస్తామని తెలిపారు. ఈ సభల్లో సుమారు 350 మంది వేద విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, ఆలయ ఈవో దూస రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Adbox

@templatesyard